Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక్కడ మంచు నల్లగా కురుస్తుంది!

Black Snow in a Russian town
  • రష్యాలో ఆశ్చర్యకర పరిణామం
  • ఓంసుచన్ పట్టణంలో నల్లమంచు
  • థర్మల్ వేడినీళ్ల ప్లాంటే కారణం
  • ఇది బొగ్గు ఆధారిత ప్లాంట్
  • భారీ ఎత్తున కాలుష్యం
మంచు తెల్లగా ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఓ పట్టణంలో మాత్రం మంచు నల్లగా కురుస్తుంది. ఓంసుచన్ అనే పట్టణంలో కురిసే మంచు ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడి నల్లటి మంచుకు బలమైన కారణమే ఉంది.

ఓంసుచన్ పట్టణంలో థర్మల్ ఆధారిత వేడి నీళ్ల ప్లాంట్ ఉంది. సైబీరియా ప్రాంతంలో గడ్డకట్టించే చలి ఉంటుంది. అందుకే ఈ ప్లాంట్ ద్వారా 4 వేల మందికి వేడి నీరు సరఫరా చేస్తారు. దీనికి బొగ్గు ఇంధనంగా వాడతారు. దాంతో ఈ ప్రాంతంలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంటుంది. ప్లాంట్ నుంచి వెలువడే మసి మంచును సైతం నల్లగా మార్చేస్తోంది. ఇక్కడ కురిసే మంచు కొన్ని అడుగుల మేర పేరుకుపోతుంది. ఈ నల్ల మంచుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి.
Black Snow
Thermal Hot Water Plant
Russia
Pollution

More Telugu News